ప్రజలకు వన దేవతల ఆశీస్సులుండాలి
ప్రజలకు వన దేవతల ఆశీస్సులుండాలి అగ్రంపహాడ్‌లో ఎమ్మెల్యే రేవూరి ప్రత్యేక పూజలు కాకతీయ, ఆత్మకూరు : పరకాల నియోజకవర్గ ప్రజలపై సమ్మక్క–సారలమ్మ తల్లుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం అగ్రంపహాడ్‌లోని సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. తల్లుల దయవల్ల పరకాల ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని, నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జాతర నిర్వహణ కోసం పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగాన్ని అభినందించారు. ముఖ్యంగా భద్రతా చర్యల్లో...