మేడారం జాతరలో అర్ధరాత్రి గందరగోళం
మేడారం జాతరలో అర్ధరాత్రి గందరగోళం అదుపు తప్పిన క్యూలైన్లు.. ఒక్కసారిగా తోపులాట పరిస్థితిని నియంత్రించలేక చేతులెత్తేసిన పోలీసులు భక్తులకా జాతర.. వీఐపీలకా? అంటూ మండిపాటు కాకతీయ, మేడారం బృందం : మేడారం మహాజాతరలో అర్ధరాత్రి తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మవార్ల దర్శనానికి ఏర్పాటుచేసిన క్యూలైన్లు అదుపు తప్పడంతో ఒక్కసారిగా భక్తుల మధ్య తోపులాట జరిగింది. పెరిగిన రద్దీని నియంత్రించడంలో పోలీసులు విఫలమవడంతో పరిస్థితి కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి సమయంలో దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో క్యూలైన్లు కుదించుకుపోయాయి. ముందుకు...