సీఎం దిష్టిబొమ్మ దహనానికి అనుమతి లేదు
సీఎం దిష్టిబొమ్మ దహనానికి అనుమతి లేదు బీఆర్ఎస్ ధర్నాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు కాకతీయ, మణుగూరు : సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినకి నవీన్ స్పష్టం చేశారు. ఆదివారం బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు కావాలనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల...