వైద్య బృందానికి డీఎంహెచ్ఓ అభినందనలు
వైద్య బృందానికి డీఎంహెచ్ఓ అభినందనలు కాకతీయ, ఆత్మకూరు : అగ్రంపహాడ్ సమ్మక్క–సారాలమ్మ జాతరకు వచ్చిన భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు, సిబ్బంది పని భేష్ అని హనుమకొండ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ప్రశంసించారు. ఆదివారం ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్‌లో నాలుగు రోజుల పాటు 24 గంటలు నిరంతరంగా వైద్య సేవలు అందించిన వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, జాతర కాలంలో మూడు షిఫ్టులలో మొత్తం 4,452 మంది ఔట్‌పేషెంట్లకు వైద్య సేవలు అందించామని తెలిపారు....