గ్రామస్థాయి ప్రతిభకు వేదికగా సీఎం కప్ పోటీలు
గ్రామస్థాయి ప్రతిభకు వేదికగా సీఎం కప్ పోటీలు నల్లబెల్లిలో ఉత్సాహంగా మండల స్థాయి క్రీడా సంబరాలు కాకతీయ, నల్లబెల్లి: గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్ మండల స్థాయి క్రీడా పోటీలు సోమవారం నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలోని కాకతీయ బ్రిలియంట్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. గ్రామ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ మండల స్థాయి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించగా విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో...