హైస్కూల్‌లో మిన్నంటిన క్రీడా ఉత్సాహం
హైస్కూల్‌లో మిన్నంటిన క్రీడా ఉత్సాహం వైభవంగా ప్రారంభమైన ‘సీఎం కప్–2026’ పోటీలు కాకతీయ, కామేపల్లి: తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సీఎం కప్–2026’ క్రీడా సంబరాలు కామేపల్లి మండలం గోవింద్రాల బంజారా హైస్కూల్ ప్రాంగణంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, యువత క్రీడా స్ఫూర్తితో ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి...