ఎన్నికల విధుల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలి
ఎన్నికల విధుల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలి పారదర్శకంగా గుర్తుల కేటాయింపునకు కలెక్టర్ ఆదేశం అధికారులు పూర్తిస్థాయి అవగాహనతో పనిచేయాలి వైరాలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం :మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. నిబంధనల మేరకు ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. మంగళవారం వైరా తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల...