సెట్టిల్‌మెంట్ డబ్బుల వివాదం
సెట్టిల్‌మెంట్ డబ్బుల వివాదం పోలీస్‌స్టేషన్ ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం కాకతీయ, హుజురాబాద్ : విడాకుల సమయంలో ఒప్పుకున్న సెటిల్‌మెంట్ డబ్బులు భర్త ఇవ్వకపోవడం, పోలీసుల నుంచి న్యాయం అందలేదన్న ఆవేదనతో ఓ వివాహిత పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన పోలీసులు, స్థానికుల చొరవతో ప్రమాదం తప్పింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం తిగారం గ్రామానికి చెందిన గండ్రకోట జంపయ్య, మహాలక్ష్మి దంపతుల కుమార్తె పావనికి, హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కుంచపు అరవింద్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన...