టీయూడబ్ల్యూజే 2026 మీడియా డైరీ ఆవిష్కరణ

టీయూడబ్ల్యూజే 2026 మీడియా డైరీ ఆవిష్కరణ కాకతీయ, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) ఆధ్వర్యంలో ముద్రించిన 2026 నూతన సంవత్సర మీడియా డైరీని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం మంగళవారం తన కార్యాలయంలో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ గౌస్ అలాం మాట్లాడుతూ, సమాజంలో మీడియా పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని అభినందించారు. “శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు జర్నలిస్టుల సహకారం...