ఎన్నికల అభ్యర్థులకు అవగాహన సదస్సు

ఎన్నికల అభ్యర్థులకు అవగాహన సదస్సు కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు–2026ను పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 30 వార్డులకు సంబంధించిన 143 మంది అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) జి. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నియమావళి ఉల్లంఘనకు పాల్పడితే SST, VST బృందాల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు...