పదో తరగతి టాపర్లకు నగదు ప్రోత్సాహకాలు

పదో తరగతి టాపర్లకు నగదు ప్రోత్సాహకాలు కాకతీయ, నల్లబెల్లి : ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ డివిజన్ మేనేజర్ వరప్రసాద్ అన్నారు. బుధవారం నల్లబెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “చదువుకో తెలంగాణ” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ...