సీఎం కప్‌లో ఆకునూరు విద్యార్థుల సత్తా
సీఎం కప్‌లో ఆకునూరు విద్యార్థుల సత్తా కాకతీయ, చేర్యాల : మండలంలోని ఆకునూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు సీఎం కప్ క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. చేర్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జనవరి 30, 31 తేదీలలో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో విద్యార్థులు పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. బాలికల విభాగంలో వాలీబాల్, కబడ్డీ పోటీల్లో ప్రథమ స్థానాలు సాధించారు. బాలుర విభాగంలో కబడ్డీ, ఖోఖో పోటీల్లో కూడా మొదటి స్థానాలు దక్కించుకున్నారు. అండర్–16 విభాగంలో...