మేడారం వెళ్తుండగా వాహనం బోల్తా

మేడారం వెళ్తుండగా వాహనం బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు కాకతీయ, ఏటూరునాగారం : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్తున్న భక్తుల వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతం నుంచి భక్తులతో మేడారానికి వెళ్తున్న వాహనం తాడ్వాయి మండల కేంద్రం దాటిన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేకపోవడంతో ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడినట్లు స్థానికులు...