హంతకులను కఠినంగా శిక్షించాలి
హంతకులను కఠినంగా శిక్షించాలి మహిళా న్యాయవాది హత్యపై చేర్యాలలో నిరసన విధుల బహిష్కరించిన బార్ అసోసియేషన్ నాయకులు కాకతీయ, చేర్యాల: చేవెళ్ల కోర్టులో యువ న్యాయవాది స్వప్న దారుణ హత్యను నిరసిస్తూ చేర్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించి, ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరెళ్ల వీర మల్లయ్య మాట్లాడుతూ, న్యాయవాదులపై జరుగుతున్న దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన...