బండి సంజయ్‌కు తపాలా ఉద్యోగుల వినతి
బండి సంజయ్‌కు తపాలా ఉద్యోగుల వినతి కాకతీయ, జమ్మికుంట: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్–సి రాష్ట్ర నాయకులు యూ. మహేందర్ కలిసి కీలక వినతి పత్రం అందజేశారు. జమ్మికుంట పర్యటనకు వచ్చిన సందర్భంగా మహేందర్ ఆయన్ను కలిసి తపాలా ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదో వేతన కమిటీని త్వరితగతిన అమలు చేయాలని, మధ్యంతర భృతిని 20 శాతం వరకు పెంచాలని కోరినట్లు తెలిపారు....