రూ. 40 కోట్లు అంచనా!
రూ. 40 కోట్లు అంచనా! మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం ఈసారి జాతరలో 788 హుండీలు హనుమకొండ టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాట్లు లెక్కింపును ప్రారంభించిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కాకతీయ, తెలంగాణ బ్యూరో: మేడారం మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఈ లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. దీని కోసం దాదాపు పది రోజుల సమయం పట్టనుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి మేడారంలో 788 హుండీలను అధికారులు ఏర్పాటు చేయగా...