తప్పిన పెను ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం ఫ్లైఓవర్‌పై టైర్ బ్లాస్ట్‌తో అదుపు త‌ప్పిన బ‌స్సు జ‌మ్మికుంట‌లో ప్ర‌మాద ఘ‌ట‌న‌ కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై బస్సు ప్రమాదానికి గురై పెను ప్రమాదం తప్పింది. హుజురాబాద్ నుంచి జమ్మికుంటకు వస్తున్న ప్రయాణికుల బస్సు టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. పెద్ద శబ్దంతో బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు కంగారుపడ్డారు. అయితే సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే స్పందించి బస్సులో ఉన్న వారిని...