రఘునాథ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో సీపీ తనిఖీ
రఘునాథ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో సీపీ తనిఖీ స్టేషన్ నిర్వహణ మెరుగుపరచాలని ఆదేశాలు పెద్దపులి సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచన కాకతీయ, హనుమకొండ : రఘునాథ్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన, రికార్డు రూమ్, స్టేషన్ రైటర్ రూమ్, రిసెప్షన్ సెంటర్ తదితర విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ మరింత క్రమబద్ధంగా ఉండాలని, రికార్డులను సక్రమంగా భద్రపరచాలని అధికారులకు స్పష్టం...