శివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

శివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు భక్తులకు సాఫీ దర్శనం కల్పించాలి అధికారులకు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాలు కాకతీయ, వేములవాడ: వేములవాడలో మహా శివరాత్రి జాతరను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీఐపీ దర్శనాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ద్వారాలు, బారికేడింగ్ వ్యవస్థను పరిశీలించిన కలెక్టర్, క్యూ లైన్ల నిర్వహణపై ఆలయ ఈఈ రాజేష్‌కు సూచనలు చేశారు....