ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ను నిలదీయండి
ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ను నిలదీయండి మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎమ్మెల్సీ రవీందర్ రావు పిలుపు కాకతీయ, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణం నిజంగా అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కారు గుర్తుకు ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని 6, 7, 8, 18, 19 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వారు ఓటర్లను కలుసుకున్నారు....