రామాలయ దొంగతనం కేసు చేధించిన పోలీసులు
రామాలయ దొంగతనం కేసు చేధించిన పోలీసులు భార్యాభర్తల అరెస్ట్ – ఆభరణాలు, నగదు స్వాధీనం కాకతీయ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్‌లో ఉన్న కోదండ రామాలయంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ ఘటనకు పాల్పడిన భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. గత నెల 3వ తేదీ అర్ధరాత్రి ఆలయ తాళం పగలగొట్టి, దేవుడికి చెందిన బంగారు–వెండి ఆభరణాలు, హుండీలోని నగదును దుండగులు అపహరించారు. ఆలయ పూజారి సముద్రాల జగన్మోహన్ చారి ఇచ్చిన ఫిర్యాదు...