ఉమ్మడి జిల్లా కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభం
ఉమ్మడి జిల్లా కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభం కాకతీయ, ఇనుగుర్తి: మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతో అవసరమని ఎస్సై గంగారపు కరుణాకర్ అన్నారు. చిన్ననాగారం గ్రామంలో మహాశివరాత్రి, ముత్యాలమ్మ బోనాల జాతర సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే ఈ పోటీలను ఎస్సై కరుణాకర్, ఎంపీడీవో పార్థసారథి, సర్పంచి సుజాత యాకయ్య తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీలను ప్రశాంత వాతావరణంలో క్రీడాస్ఫూర్తితో నిర్వహించుకోవాలని...