ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం ఐదు ఫైర్ టెండర్లతో మంటలు అదుపు కీలక రికార్డుల భద్రతపై ఆందోళన ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు షార్ట్ సర్క్యూట్ కారణమేనని అనుమానం కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) కార్యాలయంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అత్యంత కీలకమైన న్యాయసంబంధ ఆధారాలు భద్రపరిచే ఈ కార్యాలయంలో మంటలు చెలరేగడం అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఉదయం సుమారు 10:21 గంటలకు అగ్నిమాపక శాఖకు ప్రమాద...