హామీలు ఏమయ్యాయి రేవంత్ రెడ్డి?
హామీలు ఏమయ్యాయి రేవంత్ రెడ్డి? పైసలు లేని ప్రభుత్వానికి ఓటేస్తే గజ్వేల్‌కు నిధులెలా? కాకతీయ, గజ్వేల్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. “లంకె బిందెలు దొరుకుతాయని ప్రజలు ఆశిస్తే చివరకు చేతికి చిప్ప మిగిలింది. నా దగ్గర ఐదు పైసల బిళ్ల కూడా లేదు అని...