సింగరాయ గుట్టల్లో పెద్ద పులి

సింగరాయ గుట్టల్లో పెద్ద పులి మూడు జిల్లాల సరిహద్దుల్లో భయాందోళనలు పశువులపై దాడులు.. గ్రామాల్లో అప్రమత్తత కాక‌తీయ‌, హుస్నాబాద్ : యాదాద్రి భువనగిరి, జనగాం, సిద్ధిపేట జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచారం ప్రజలను గడగడలాడిస్తోంది. సింగరాయ గుట్టల అటవీ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. మోయాతూమ్మెద వాగు పరిసర ప్రాంతాల్లో పులి అడుగుల ముద్రలు కనిపించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. తంగళ్లపల్లి–కూరెళ్ల గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో రాత్రివేళల్లో వినిపిస్తున్న గాండ్రింపు...