పేరుకే మున్సిపాలిటీ…
పేరుకే మున్సిపాలిటీ… దశాబ్దాలుగా ఎన్నికలే లేని మణుగూరు! మున్సిపాలిటీగా ఉన్నా ప్రజాస్వామ్యం దూరం ప్రజాప్రతినిధుల్లేని పాలనతో ఇబ్బందులు కోర్టు కేసులే ప్రధాన అడ్డంకి… కుంటుపడుతున్న అభివృద్ధి కాకతీయ, మణుగూరు టౌన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణం గత ఇరవై ఏళ్లుగా ఎన్నికలు లేకుండానే కొనసాగుతోంది. 2004–05లో మున్సిపాలిటీగా ప్రకటించినా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎన్నికలు జరగకపోవడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే ప్రజా ప్రతినిధులే లేకపోవడంతో పరిపాలనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి...