బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి

బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి కాంగ్రెస్ పాలనపై సినీ రచయిత మిట్టపల్లి సురేందర్ విమర్శలు కాకతీయ, స్టేషన్ ఘనపూర్ : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రముఖ సినీ గేయ రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు మిట్టపల్లి సురేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా, మిట్టపల్లి సురేందర్ తన పాటలతో జనాన్ని ఉత్సాహపరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...