డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్

డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్ ఎన్నికల ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని ఆదేశం కాక‌తీయ‌, చేర్యాల : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేర్యాలలో ఏర్పాటైన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను ఆమె పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం...