కరీంనగర్‌లో కాంగ్రెస్ ప్రచార హోరు
కరీంనగర్‌లో కాంగ్రెస్ ప్రచార హోరు ఇంటింటి ప్రచారం.. ర్యాలీల్లో పాల్గొన్న మంత్రులు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తోంది. డివిజన్‌లవారీగా ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లతో ప్రజలను నేరుగా కలుస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగి అభ్యర్థులకు అండగా ప్రచారాన్ని నడిపిస్తున్నారు. 50వ డివిజన్ జ్యోతి నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాచకొండ చక్రధర్‌రావుకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో...