అనధికార ఇసుక ర్యాంపే ప్రాణాలు తీసిందా?
అనధికార ఇసుక ర్యాంపే ప్రాణాలు తీసిందా? పాపం మొత్తం అధికార యంత్రాంగానిదే సాయం చేయబోయి ప్రాణాలు కోల్పోయిన గిరిజన యువకుడు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : అనధికారికంగా ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపు ఒక గిరిజన కుటుంబంలో చీకట్లు నింపింది. సాయం కోసం వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా అధికారులు స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం గ్రామానికి చెందిన వీ సాల వెంకటేశ్వర్లు (42) ఆదివారం ఉదయం ముర్రేడు వాగులో ఇసుక కోసం వెళ్లిన ఎడ్లబండి నీటమునిగిన విషయం...