27 ఏళ్ల స్నేహబంధానికి నూతనోత్సాహం

27 ఏళ్ల స్నేహబంధానికి నూతనోత్సాహం పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికతో భావోద్వేగాలు స్నేహానికి గుర్తుగా 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కాక‌తీయ‌, క‌ల్లూరు : చండ్రుపట్ల జెడ్‌పీఎస్‌ఎస్‌లో 1993–98 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 27 సంవత్సరాల అనంతరం అపూర్వంగా కలుసుకుని తమ స్నేహాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. సుమారు 60 మంది విద్యార్థులు మామిడితోటలో సమావేశమై చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.ఆనందభాష్పాలతో ఒకరినొకరు పలకరించుకుంటూ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. కార్యక్రమానికి ముందు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు....