ఓరుగల్లులో రాకెట్ గర్జన

ఓరుగల్లులో రాకెట్ గర్జన వరంగల్ చరిత్రలో తొలిసారిగా రాకెట్ ప్రయోగం జాతీయ సైన్స్ దినోత్సవం రోజే లాంచింగ్ కాకతీయ, హనుమకొండ : వరంగల్ గడ్డపై చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఓరుగల్లు చరిత్రలో తొలిసారిగా రాకెట్ లాంచింగ్ కార్యక్రమాన్ని ఈ నెల 28న నిర్వహించనున్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్లో “రుద్రమ” పేరుతో రూపొందించిన మోడల్ రాకెట్‌ను ఆకాశంలోకి ప్రయోగించనున్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ఇస్రో స్పేస్ ట్యూటర్, ఏటీడీఆర్ఎల్ సంస్థ వ్యవస్థాపకుడు శశాంక్ భూపతి నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. దీనికి...