ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి తొర్రూర్ ఆర్డీవో గణేష్ ఆదేశాలు కాకతీయ, మరిపెడ : మున్సిపాలిటీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహించాలని తొర్రూర్ ఆర్డీవో జి. గణేష్ అధికారులకు సూచించారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తహసిల్దార్ కొండపల్లి కృష్ణవేణితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, త్రాగునీటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా...