ఎఫ్‌ఎల్‌ఎస్ మోడల్ పరీక్షలు తప్పనిసరి

ఎఫ్‌ఎల్‌ఎస్ మోడల్ పరీక్షలు తప్పనిసరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ (ఎఫ్‌ఎల్‌ఎస్)లో భాగంగా తరచూ మోడల్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు ప్రాథమిక పాఠశాల, గోపాలపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలను ఆమె సందర్శించారు. 3వ తరగతి విద్యార్థులతో గణితం, ఆంగ్ల పాఠాలు చదివించి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. నోట్‌బుక్స్ తనిఖీ చేసి రాత నైపుణ్యంపై ఉపాధ్యాయులకు సూచనలు...