ములుగులో ముగిసిన ప్రచార పోరు
ములుగులో ముగిసిన ప్రచార పోరు త్రిముఖ పోటీలో ఉత్కంఠ.. ఓటరు తీర్పుపై ఆసక్తి 11న పోలింగ్‌కు స్థానిక సెలవు.. మొదలుకానున్న నిశ్శబ్ద రాజకీయం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారంతో అధికారికంగా ముగిసింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొనగా చివరి రోజు వరకు హోరాహోరీ ప్రచారం సాగింది. అన్ని వార్డుల్లో అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. మంత్రి సీతక్క సొంత నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది....