సమస్యల పరిష్కారమే లక్ష్యం
సమస్యల పరిష్కారమే లక్ష్యం 7వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి బైకానీ సునీత కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో 7వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి బైకానీ సునీత ఓదేలు ఆదివారం ఉదయం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ, తనను కౌన్సిలర్‌గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, 7వ వార్డులో తాగునీరు, కాల్వలు, వీధి దీపాలు, రహదారులు, పారిశుధ్యం వంటి పలు సమస్యలు ఉన్నాయని, వాటిపై తనకు...