వాహనాల అప్పగింత ప్రారంభం
వాహనాల అప్పగింత ప్రారంభం యజమానులు ఆధారాలతో వచ్చి వాహనాలు తీసుకోవాలి పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాకతీయ, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాలను సంబంధిత యజమానులకు తిరిగి అప్పగించేందుకు చర్యలు ప్రారంభించినట్లు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వివిధ ఘటనల్లో పట్టుబడిన వాహనాలను హనుమకొండ భీమారం సీఆర్‌పీఎఫ్ కేంద్రంలో భద్రపరిచినట్లు ఆయన వెల్లడించారు. ఈ వాహనాలను సంబంధిత పోలీస్ స్టేషన్ల వారీగా గుర్తించి, ఆయా యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ...