ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి
ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరిక కాకతీయ, కొత్తగూడెం : మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ కోరారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు కొత్తగూడెం పట్టణంలోని 33 డివిజన్లలో రూ.34 వేల విలువైన 40 లీటర్ల మద్యం, రూ.2.70 లక్షల విలువైన...