పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కాకతీయ, కల్లూరు : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరును పరిశీలించిన కలెక్టర్, పోలింగ్ సిబ్బందితో మాట్లాడి బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, పీవో డైరీ...