నాగసుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పుష్పాలంకరణ
నాగసుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పుష్పాలంకరణ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు కాకతీయ, గీసుగొండ : ప్రసిద్ధి చెందిన ఊకల్ హవేలీ గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనా చార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని వివిధ రకాల పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ విశేష అలంకరణలో దర్శనమిచ్చిన నాగసుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్యరూపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ...