కన్నతల్లి మరణించినా వీడని పౌర బాధ్యత

కన్నతల్లి మరణించినా వీడని పౌర బాధ్యత కాకతీయ, జమ్మికుంట : కన్నతల్లి మరణించిన తీవ్ర విషాదంలోనూ ఓ యువకుడు తన పౌర బాధ్యతను విస్మరించకుండా ఆదర్శంగా నిలిచాడు. జమ్మికుంట మున్సిపాలిటీ 18వ వార్డు పరిధిలోని కొత్తపల్లికి చెందిన రాజు బి. ఈ రోజు అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబం మొత్తం దుఃఖసాగరంలో మునిగిపోయిన వేళ, ఆమె కుమారుడు ఎండి ఇస్మాయిల్ మాత్రం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో తల్లి మృతదేహం ఉండగానే, తన బాధను గుండెల్లో దాచుకుని పోలింగ్ కేంద్రానికి...