పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కె. హైమావతి
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కె. హైమావతి కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల–పెద్దమ్మగడ్డ, పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కో-ఎడ్యుకేషన్)లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. కొన్ని కేంద్రాల్లో వైద్య శిబిరాలు, బీఎల్ఓ స్లిప్ పంపిణీ కేంద్రాలు పోలింగ్ కేంద్రం లోపల ఏర్పాటు...