వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు

వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు నర్సంపేటలో 85.21%, వర్ధన్నపేటలో 86.23% పోలింగ్ నమోదు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద వెల్లడించారు. నర్సంపేట మున్సిపాలిటీలోని 30 వార్డుల పరిధిలో 60 పోలింగ్ కేంద్రాల్లో 85.21 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 40,968 మంది ఓటర్లలో 34,908 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా వర్ధన్నపేట...