ప్రశాంతంగా ఐదు మున్సిపాలిటీల పోలింగ్

ప్రశాంతంగా ఐదు మున్సిపాలిటీల పోలింగ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ స్వేచ్ఛాయుత ఓటింగ్‌కు పటిష్ట చర్యలు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా కొనసాగుతోందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎదులాపురం, వైరా, కల్లూరు, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ కేంద్రాలను ఆయన ప్రత్యక్షంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సరళి, బందోబస్తు పరిస్థితులపై అడిషనల్ డీసీపీలు ప్రసాద్ రావు, రామానుజం, కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్‌తో కలిసి సమీక్ష...