కొమ్మాల దేవస్థానంలో ప్రసాద విక్రయాలకు వేలం
కొమ్మాల దేవస్థానంలో ప్రసాద విక్రయాలకు వేలం వివిధ రకాల వేలాల ద్వారా రూ.9,45,500/- ఆదాయం గత సంవత్సరం కంటే రూ.1,96,500/- అధిక ఆదాయం కాకతీయ, గీసుగొండ : మండలంలోని కొమ్మాల గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిర్వహించిన విక్రయ హక్కుల వేలాలు విజయవంతమయ్యాయి. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన వేలాల ద్వారా మొత్తం రూ.9,45,500 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పి.ప్రసాద్ తెలిపారు. గత సంవత్సరం...