కార్మికుల సమ్మెకు మద్దతుగా సీఐటీయూ ర్యాలీ

కార్మికుల సమ్మెకు మద్దతుగా సీఐటీయూ ర్యాలీ కాకతీయ, బోనకల్ : దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా బోనకల్ మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఖమ్మం సెంటర్ వరకు కొనసాగింది. కార్మిక సంఘాలు, కూలి సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, వ్యవసాయ కూలీలకు...