సబ్‌స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

సబ్‌స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాకతీయ.నల్లబెల్లి : నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా బలోపేతం కావడంతో రైతులు, గృహ వినియోగదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ సబ్‌స్టేషన్ ప్రారంభంతో కొండాపూర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది. లో వోల్టేజ్, తరచూ విద్యుత్...