శివరాత్రికి సిద్ధమైన నల్లబెల్లి రాజరాజేశ్వరాలయాలు

శివరాత్రికి సిద్ధమైన నల్లబెల్లి రాజరాజేశ్వరాలయాలు అభిషేకాలు, రుద్రహోమం, కళ్యాణ మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు కాకతీయ, నల్లబెల్లి : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లబెల్లి మండల కేంద్రంతో పాటు గుండ్లపహాడ్, మేడపల్లి గ్రామాల్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాలు భక్తుల రాకకు సిద్ధమయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. శివరాత్రి రోజున ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక అభిషేకాలు, నిత్య అర్చనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 10...