ఆధునిక సాంకేతికతతో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

ఆధునిక సాంకేతికతతో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విజయవంతంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికిలోనైన దుర్షేడ్ గ్రామానికి చెందిన వేల్పుల తిరుపతి (27) స్వచ్ఛందంగా ఇంటి నుండి వెళ్లిపోయి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా సీసీ కెమెరా దృశ్యాలు,...