వెన్నవల్లిలో సమస్యలపై సర్పంచ్ ప్రత్యేక దృష్టి
వెన్నవల్లిలో సమస్యలపై సర్పంచ్ ప్రత్యేక దృష్టి స్మశానవాటిక దారి, కాలువలు, సందు రోడ్ల అభివృద్ధికి చర్యలు కాకతీయ, కల్లూరు : మండలంలోని వెన్నవల్లి గ్రామపంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సర్పంచ్ కంభంపాటి లక్ష్మీ వెంకటేశ్వర్లు చర్యలు చేపడుతున్నారు. గ్రామ స్మశానవాటికకు వెళ్లే దారి సరిగా లేకపోవడం, చెట్లు పెరిగి రాకపోకలకు అంతరాయం కలగడం వంటి సమస్యలను గుర్తించిన సర్పంచ్, స్వయంగా పర్యవేక్షిస్తూ జంగిల్ వర్క్ చేపట్టిస్తున్నారు. అలాగే కాలువలు సరిగా లేక నీరు నిల్వ ఉండే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కందకాలు తీయించి...